సోల్ అఫ్ ‘మహా’సముద్రం… అదితి రావు హైదరి ఫస్ట్ లుక్

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ‘మహాసముద్రం’ చిత్రం నుంచి అదితి రావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. సోల్ అఫ్ ‘మహా’సముద్రం అంటూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అదితి లుక్ ఆకట్టుకోగా… ఆమె ‘మహా’ అనే పాత్రను పోషిస్తోంది. ఇక ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో శర్వానంద్ ఆయుధం పట్టుకుని సీరియస్ గా కన్పించడం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రం ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఆర్ఎక్స్ 100’ తరువాత దర్శకుడు అజయ్ భూపతి చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాపై ఆయన చాలా ఆశలే పెట్టుకున్నారు. 

-Advertisement-సోల్ అఫ్ 'మహా'సముద్రం... అదితి రావు హైదరి ఫస్ట్ లుక్

Related Articles

Latest Articles