గత దశాబ్ధకాలంగా చైనా దూకుడును ప్రదర్శిస్తొంది. అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్న యుద్దం తరువాత రష్యా బలం కాస్త తగ్గగా, చైనా దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇది అమెరికాతో పాటుగా, ప్రపంచానికి కూడా పెద్ద ప్రమాదంగా మారింది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులు తక్కువ ధరకే విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో పాటుగా, ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచానికి వ్యాపించడంతో అన్ని దేశాలు గుర్రున ఉన్నాయి. చైనాపై కోపం ఉన్నప్పటికీ, ఆ దేశంతో ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా దేశాలు సైలెంట్‌గా ఉండిపోతున్నాయి. అయితే, చైనా నుంచి అమెరికాకు అన్నివిధాలుగా ముప్పు పొంచి ఉండటంతో, డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేసేందుకు సిద్దమయింది. జీ7, నాటో దేశాల సమావేశంలో అమెరికా ఈ విషయంపైనే దృష్టిసారించింది.
Read: ఈ హీరోకి… సొట్ట బుగ్గల బ్యూటీస్ చాలా ఇష్టమట!
అటు రష్యాతో కూడా ఈ విషయంపై చర్చలు జరిపింది. చైనా దూకుడుపై రష్యా గుర్రుగా ఉన్నప్పటికీ, రష్యానుంచి అధికమొత్తంలో సహజవాయువులను చైనా దిగుమతి చేసుకుంటుండటంతో, ఆర్ధిక ప్రయోజనాల దృష్ట్యా ఆ దేశం పూర్తిస్థాయిలో అమెరికాకు మద్దతు ఇస్తుందని అనుకోలేము. అసియా దేశాలపై ముఖ్యంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలపై అమెరికా కొంత పట్టు సడలిస్తే అది రష్యాకు కలిసివస్తుంది. గల్ఫ్ దేశాలపై రష్యా తిరిగి పట్టు సాధిస్తే, మరోసారి పుతిన్ తన ప్రతాపం చూపించే అవకాశం ఉంటుంది. చైనా దూకుడును తగ్గించేందుకు మొత్తానికి రష్యాతో దోస్తికి అమెరికా చేతులు చాచడం శుభపరిణామం అని చెప్పుకోవాలి.