అసలే పాక్ క్రికెట్ బోర్డు నష్టాల్లో మునిగిపోయింది. ఇటీవలే న్యూజిలాండ్ జట్టు పర్యటనకు వచ్చి చివరి నిమిషంలో పర్యటను క్యాన్సిల్ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. దీంతో పాక్ క్రికెట్ కు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. బందోబస్తు కోసం 500 మంది పోలీసులను ఏర్పాటు చేసింది. అంతేకాదు, బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కూడా రంగంలోకి దించింది. వీరందరిని న్యూజిలాండ్ జట్టు బస చేస్తున్న హోటల్స్ వద్ద బందోబస్తుకు ఏర్పాటు చేసింది. అయితే, వారం రోజులపాటు పాక్ లోనే ఉన్న న్యూజిలాండ్ జట్టు ఏమైందో అర్ధాంతరంగా రద్దు చేసుకొని వెనక్కి వెళ్ళిపోయింది. ఇదొక ఎత్తైతే, భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీసులు ఏడు రోజులపాటు బిర్యానీ కోసం ఏకంగా రూ.27 లక్షల ఖర్చు అయిందట. ప్రతిరోజూ రెండు సార్లు పోలీసులకు బిర్యానీని పెట్టామని దానికి రూ 27 లక్షల ఖర్చు అయ్యిందని పాక్ క్రికెట్ బోర్డు పేర్కొన్నది. ప్రస్తుతం ఈ బిల్లును బోర్డు పెండింగ్ లో పెట్టడంతో హోటల్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. తమ బిల్లులు వెంటనే చెల్లించాలని పాక్ క్రికెట్ బోర్డుకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read: ఆఫ్ఘన్ లో ఏం జరుగుతోంది… ఆ ఇద్దరు కీలక నేతలు ఏమయ్యారు?