“కార్తికేయ-2″కు ఆసక్తికర టైటిల్ ?

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత “కార్తికేయ-2” భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఇది రూపొందనుంది. ఇటీవలే సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ “కార్తికేయ-2” అని పెట్టారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Read Also : “యూటర్న్” బ్యూటీ హాట్ నెస్ తట్టుకోవడం కష్టమే…!

“దైవం మనుష్య రూపేన” అనే టైటిల్ ను ఈ చిత్రానికి లాక్ చేశారని అంటున్నారు. ఇక ఈ సినిమాను పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి పలు ప్రాంతాల్లో చిత్రీకరించారు. నెక్స్ట్ షెడ్యూల్ ఆగస్టు నుండి యూరప్, వియత్నాంలో జరగనుంది. ఇప్పటికే ఈ టీం మొత్తం కోవిడ్ వ్యాక్సినేషన్ టీకాలను వేయించుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-