‘రౌడీయిజం’ చేయబోతున్న బాలకృష్ణ

‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ హిట్ తో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కథాంశంతో ఈ సినిమాని తీయనున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ మూవీ నిర్మించనుంది. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనికి ‘రౌడీయిజం’ అనే పేరు పెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. ఆ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ టైటిల్‌ను ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేసినట్లు సమాచారం.

Read Also : సామ్, చై మధ్య ఏం లేనట్టేనా ?

అంతే కాదు టైటిల్ ను అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తారట. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది. త్రిష, ఇలియానాలో ఒకరు కథానాయికగా నటించే ఛాన్స్ ఉందంటున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-