నేడు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ ఫలితాలు

ఏపీ ఇంటర్‌ విద్యార్థులకు ఇంటర్‌ బోర్టు శుభవార్త చెప్పింది. ఈ రోజు ఇంటర్‌ అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపింది. సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు వెల్లడించారు.

ఫలితాల విడుదల అనంతరం ఈ నెల 26 నుంచి నవంబర్ 2వరకు రీ వాల్యూవేషన్‌, రీ వెరిఫికేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని బోర్టు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రీ వాల్యువేషన్‌ కు రూ.260, రీ వెరిఫికేషన్‌ కొరకు రూ.1300 చెల్లించాల్సి ఉంటుందని, రీ వాల్యువేషన్‌, రీ వెరిఫికేషన్‌ సమయంలో స్కాన్‌ కాపీని ఉంచుకోవాలని సూచించారు.

Related Articles

Latest Articles