ఇంట‌ర్ అడ్మిష‌న్‌ గ‌డువు పెంపు… ఇదే చివ‌రి అవ‌కాశం…

ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం అడ్మిష‌న్స్ ను మ‌రోసారి పొడిగించారు.  ఇప్ప‌టికే ప‌లుమార్లు తేదీని పొడిగిస్తూ వ‌చ్చిన ఇంట‌ర్ బోర్డ్ తాజాగా ఈనెల 30 వ‌ర‌కు గ‌డువును పొడిగించింది.  ఇదే చివ‌రి అవ‌కాశం అని, మొద‌టి సంవ‌త్స‌రంలో చేరే విద్యార్థులు 30 వ తేదీలోగా అడ్మీషన్లు పొందాల‌ని పేర్కొన్న‌ది.  ఇక‌, ఈ విద్యాసంవ‌త్సంలో ఇంట‌ర్‌లో 70 శాతం సిల‌బ‌స్ మాత్ర‌మే ఉండ‌బోతున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డ్ ప్ర‌క‌టించింది.  

Read: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

మొదటి, ద్వితీయ సంవ‌త్సరం 70శాతం సిల‌బ‌స్ నుంచే ప‌రీక్ష‌లు ఉంటాయ‌ని బోర్డ్ తెలియ‌జేసింది.  కోవిడ్ నేప‌థ్యంలో విద్యా సంస్థ‌ల్లో భౌతిక త‌ర‌గతులు ఆల‌స్యంగా ప్రారంభం కావ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఇంట‌ర్ బోర్డ్ తెలియ‌జేసింది.  ఇంట‌ర్ బోర్డ్ సిల‌బ‌స్‌కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కోసం బోర్డ్ వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఇంట‌ర్ బోర్డ్ తెలియ‌జేసింది.  

Related Articles

Latest Articles