హెచ్‌పీసీఎల్‌ అగ్నిప్రమాదం పై విచారణ కమిటీ నివేదిక సిద్ధం

హెచ్‌పీసీఎల్‌ అగ్నిప్రమాదం పై విచారణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. నేడు ఆ నివేదికను కలెక్టర్ వినయ్ చంద్ కు అందజేసే అవకాశం ఉంది. సీడీయు-3లో పైప్ లైన్ దెబ్బ తినడం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారణ చేసింది. పైప్ లైన్ బయటకు సరిగ్గానే కనిపించినా లోపల దెబ్బతినడాన్ని గుర్తించకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది కమిటీ. పైప్ లైన్ బలాన్ని నిర్దారించే హైడ్రో టెస్ట్ ఎప్పుడు నిర్వహించారు, ప్రమాదం తీవ్రత పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు వంటి అంశాలను ప్రస్తావించిన కమిటీ… ఫైర్ వల్ల జరిగిన నష్టం అంచనా వేసింది. 78 టన్నుల ముడి చమురు దగ్ధమైందని నివేదికలో వెల్లడించింది కమిటీ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-