కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలి: కోదండరాం

గత కొన్ని రోజులుగా వరి కొనుగోలు ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెల్సిం దే. అయితే దీనిపై టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండ రాం స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు దూషణలతో ఎలాంటి ఉపయోగం ఉండదని రైతుల సమస్యలన పరిష్కరించే విధంగా ఇరు ప్రభుత్వాలు మాట్లాడు కోవాలన్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మౌలిక సౌకర్యాలు లేకపోవడం వల్లనే అక్కడక్కడ రైతులు మరణిస్తున్నారని కోదండరాం అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఢీల్లీ కి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని ఆయన సూచించారు. దీనికి తాము మద్దుతు ఇస్తామని పేర్కొన్నారు.

రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద అనుకున్నంత వేగవంతగా సాగటం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అక్కడ రవాణా సౌకర్యాలు ఏర్పా టు చేయడంతో పాటు హామాలీలు, లారీలను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రోజులకు రోజులు రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడించటం మంచిది కాదన్నారు. రైతు క్షేమం కోరే ప్రభుత్వాలు ఇలా ఎప్పటికీ చేయవని ఆయన పేర్కొ న్నారు. ఇటీవల బీరయ్య అనే రైతు మృతి చెందాడని అతడి కుటుంబానికి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. మరో రైతు మరణించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభు త్వం నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు కోదం డరాం తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేసి ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోదండరాం అన్నారు.

Related Articles

Latest Articles