సంక్రాంతి సంబురాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

సంక్రాంతి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆయన నివాసంలో సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గంగిరెద్దు విన్యాసాలను తిలకించారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రైతు బంధు ద్వారా ప్రభుత్వం ఇప్పటి వరకూ 50వేల కోట్ల నిధులను విడుదల చేసిందన్నారు. రైతులు సంక్రాంతిని రైతుబంధు సంబురాలుగా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు.

Read Also: రాష్ట్రంలో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబు: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి వుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ చేయూతతో రైతు పండగను ఘనంగా నిర్వహించుకుంటున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఆ సంతోషాన్ని పాడు చేయాలని బీజేపీ కాంగ్రెస్‌ చూస్తోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఎవరి ప్రలోభాలకు లొంగరని, బీజేపీ నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. అనంతరం మంత్రి సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు.
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు.

Related Articles

Latest Articles