వైరల్ : రైస్‌ కుక్కర్‌ తో పెళ్లి అవాక్కైన జనాలు..!

ఇండోనేషియాలో కంట్రీలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన ఆనం అనే వ్యక్తి రైస్‌ కుక్కర్‌ ను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ప్రేమించి రైస్‌ కుక్కర్‌ ను పెళ్లి చేసుకుంటున్న ఇండోనేషియన్‌ వ్యక్తి ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఈ ఫోటోల్లో తెల్లని వెడ్డి డ్రెస్‌ లో వరుడు మెరిసిపోయాడు. అలాగే… వధువు అంటే రైస్‌ కుక్కర్‌ కూడా వైట్‌ డ్రెస్‌ లో మెరిసిపోయింది.

ఇక పెళ్లి చేసుకున్న అనంతరం… తన కుక్కర్‌ భార్యతో కలిసి ఫోటోలు కూడా దిగాడు ఆనం. ఇక పెళ్లి కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. సెప్టెంబర్‌ 20 న కుక్కర్‌ తో తన పెళ్లిని ప్రకటిస్తూ.. ఆనం తన ఫేస్‌ బుక్‌ పేజీలో ఈ ఫోటోలు పోస్ట్‌ చేశాడు. అయితే.. ఈ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. తాజాగా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేశాడు ఆనం. తన భార్య అన్నం బాగా వండుతుంది కానీ ఇతర వంటలు సరిగా చేయడం లేదని.. అందుకే విడాకులు ఇచ్చానని చెప్పాడు ఆనం. ఇక వీడికి మతి భ్రమించిందని ఈ పోస్ట్‌ పై నెటిజెన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.

-Advertisement-వైరల్ : రైస్‌ కుక్కర్‌ తో పెళ్లి అవాక్కైన జనాలు..!

Related Articles

Latest Articles