ఆకట్టుకుంటున్న “బ్యాచ్” ఫోక్ సాంగ్

సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా  శివ దర్శకత్వంలో రమేశ్ ఘనమజ్జి ఓ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నాడు. ‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య’ వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ. రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాచ్’ అనే పేరు పెట్టారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ‘క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో  కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే ఈ సినిమా. తాజాగా ఈ చిత్రం నుంచి “వచ్చిందిరా” న ఫోక్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ ఫోక్ సాంగ్ లో రఘు కుంచె కూడా కన్పించారు. అసిరయ్య బోనేల ఈ సాంగ్ ను ఆలపించమే కాకుండా లిరిక్స్ కూడా అందించారు. అందులోని ర్యాప్ ను మాత్రం రఘు కుంచె పాడగా… ఆ ర్యాప్ కు గిరిధర్ రాగోలు లిరిక్స్ అందించారు. అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్న “వచ్చిందిరా” ఫోక్ నెంబర్ ను మీరు కూడా వీక్షించండి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-