కోవిడ్‌ కలకలం.. టీమిండియా ప్రాక్టీస్ సెషన్ రద్దు

టీమిండియాను కరోనా వేంటాడుతోంది. టీమిండియా కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ కరోనా బారినపడడం తెలిసిందే. ఈ ముగ్గురూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇప్పుడు టీమిండియా సహాయక బృందంలో మరొకరికి కరోనా వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్లకు ప్రాక్టీస్ సెషన్ రద్దు చేశారు. రేపు ఇంగ్లండ్‌తో ప్రారంభయ్యే చివరి ఐదో టెస్టులో కోహ్లీ సేన నేరుగా బరిలో దిగనుంది. మరోవైపు టీమిండియా సభ్యులందరికీ మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తంగా ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే చివరి టెస్ట్‌లో ఆడేందుకు సిద్ధం అవుతున్నారు టీమిండియా క్రికెటర్లు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-