పాక్ మ్యాచ్ కు ముందే భారత్ భయపడుతోంది…

ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడకముందే భారత జట్టు భయపడుతుంది అని అన్నారు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ ఈ టోర్నీ ప్రారంభంకాకముందే భారత జట్టు “ఒత్తిడిలో మరియు భయంలో ఉంది అని ఇంజమామ్ అన్నారు. ఇక ఈ పాక్ తో మ్యాచ్ అనంతరం భారత్ తన తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దాంతో సెమీస్ కు కూడా వెళ్లకుండానే భారత జట్టు సూపర్ 12 దశ నుండి బయటికి వచ్చింది.

అయితే పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందే భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌… కెప్టెన్ విరాట్ కోహ్లీని చూస్తే వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు స్పష్టమైందని ఇంజమామ్ అన్నాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత ఆటగాళ్లు భయపడ్డారని నేను భావిస్తున్నాను. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లను షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో ఔట్ కావడం వారిని చాలా ఒత్తిడికి గురి చేసింది. మా జట్టు బాడీ లాంగ్వేజ్ వారి కంటే మెరుగ్గా ఉంది. మ్యాచ్ ప్రారంభానికి ముందే వారంతా ఒత్తిడిలో ఉన్నారని స్పష్టమైంది” అని ఇంజమామ్ తెలిపారు.

Related Articles

Latest Articles