టోక్యో ఒలింపిక్స్‌: సెమీస్‌కు చేరిన ఇండియా మ‌హిళ‌ల హాకీ టీమ్‌…

టోక్యో ఒలింపిక్స్‌లో భార‌త హాకీ జ‌ట్టు దూసుకుపోతున్న‌ది.  నిన్న‌టి రోజున పురుషుల హాకీ జ‌ట్టు బ్రిట‌న్‌ను ఓడించి సెమీస్‌కు చేరుకున్న‌ది.  3-1తేడాతో బ్రిట‌న్‌ను ఓడించి సెమీస్‌లో బెల్జియంతో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మైంది.  కాగా, అదే బాట‌లో ఇప్పుడు మ‌హిళ‌ల హాకీ టీమ్ కూడా ప‌య‌నిస్తోంది. మ‌హిళ‌ల హాకీ టీమ్ బ‌ల‌మైన ఆస్ట్రేలియాపై 1-0 తేడాతో ఓడించి సెమీస్ కు చేరుకున్న‌ది.  మొద‌టి క్వార్ట‌ర్‌లో ఏ జ‌ట్టు కూడా గోల్ చేయ‌లేదు.  రెండో క్వార్టర్ 22 వ నిమిషం వ‌ద్ద భార‌త్ క్రీడాకారిణి గుర్జిత్ కౌర్ గోల్ చేసింది.  దీంతో ఇండియా 1-0 లీడ్‌లోకి రావ‌డంతో ఆస్ట్రేలియా జ‌ట్టు దూకుడు పెంచింది.  గోల్ చేసేందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నం చేసింది.  అయితే, ఆస్ట్రేలియా ప్ర‌య‌త్నాల‌ను భార‌త టీమ్ స‌మ‌ర్ధ‌వంతంగా నిలువ‌రించ‌డంతో ఇండియా జ‌ట్టు 1-0 తేడాతో విజ‌యం సాధించి సెమీస్‌కు చేరుకుంది.  1980 లో జ‌రిగిన మాస్కో ఒలింపిక్స్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 4వ స్థానంలో నిలిచింది.  ఆ త‌రువాత జ‌రిగిన ఒలింపిక్స్‌లో చెప్పుకోద‌గిన విధంగా రాణించ‌లేక‌పోయింది.  కాగా, ఇప్పుడు టోక్యోలో జ‌రుగుతున్న ఒలింపిక్స్‌లో భార‌త హాకీ ఆట‌గాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు. 

Read: రాజ్ కుంద్రా కేసు : శిల్పా శెట్టికి హీరోయిన్ సపోర్ట్

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-