రైళ్లలో కేటరింగ్‌ ప్రారంభం.. ఇప్పటికి వాటికి మాత్రమే పరిమితం.. !

కరోనా మహమ్మారి విజృంభణతో రైలు సర్వీసులను నిలిచిపోయాయి.. కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపినా అప్పటి వరకు ఉన్న భోజన సదుపాయం మాత్రం పూర్తిగా నిలిపివేశారు.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో.. క్రమంగా అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి.. ప్రస్తుతానికి ప్రీమియం రైళ్లలో ఫుడ్‌ సర్వీస్‌ అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించింది ఐఆర్‌సీటీసీ.. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్‌, తేజస్‌లతో పాటు గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోభోజనం వడ్డించడం ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది..

Read Also: పాక్‌ను గట్టిగా నిలదీసిన భారత్‌.. వాటి సంగతి ఏంటి..?

అయితే, టికెట్లు బుక్‌ చేసుకునే సమయంలోనే భోజనం సంబంధించి ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.. మారిన రేట్ల ప్రకారం ధరలను సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్‌ చేసే పనిని జోనల్‌ రైల్వేలకు అప్పగించారు.. భోజనం వడ్డింపునకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత.. ఈ సర్వీసు ప్రారంభించే కచ్చిత తేదీని ఆయన జోనల్‌ రైల్వేలు ప్రకటించనున్నాయి.. టికెట్‌ ఇప్పటికే బుక్‌ చేసినవారికి భోజన సదుపాయం ప్రారంభమైన విషయాన్ని ఎస్‌ఎంఎస్‌ లేదా ఈ మెయిల్‌ ద్వారా తెలియజేయనుంది రైల్వేశాఖ.

Related Articles

Latest Articles