రైల్వేస్టేషన్‌కి వెళుతున్నారా? బాదుడే మరి!

మీబంధువులు ఎవరైనా ఊరికి వెళుతున్నారా? వారిని సాగనంపేందుకు మీరు కూడా వెళుతున్నారా? రైల్వే స్టేషన్ వరకూ అయితే ఓకే. వారితో పాటు మీరు ప్లాట్ ఫాం ఎక్కితే మాత్రం మీ జేబుకు చిల్లుపడినట్టే. ఎందుకంటే ప్లాట్ ఫాం టికెట్ ధరలు భారీగా పెరిగాయి. పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నియంత్రించేందుకు కు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సహా మరో 14 స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.

రైల్వేస్టేషన్‌కి వెళుతున్నారా? బాదుడే మరి!

ఒక్క సికింద్రాబాదులోనే ప్లాట్ ఫాం టికెట్ ధర పది రూపాయల నుండి 50 రూపాయలకు పెరిగింది. దీంతో పాటు హైదరాబాద్,వరంగల్, ఖమ్మం, లింగంపల్లి, కాజీపేట్, మహబూబాబాద్, రామగుండం, మంచిర్యాల్, భద్రాచలం రోడ్, వికారాబాద్ ,తాండూర్, బీదర్ పార్లి వైద్యనాథ్, బేగంపేట్ లలో పది రూపాయలు ఉన్న టికెట్ ధరను 20 రూపాయలకు పెంచింది దక్షిణ మధ్య రైల్వే. ప్లాట్ ఫాం టికెట్ ధరలను తాత్కాలికంగా ఈ నెల 20 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాబట్టి ఎక్కడికీ ప్రయాణం చేయకపోయినా ప్లాట్ ఫాం ఎక్కితే చాలు 20 రూపాయలు, సికింద్రాబాద్‌లో అయితే 50 రూపాయలు చెల్లించకతప్పదు.

Related Articles

Latest Articles