అమెరికాలో అధికారాలు బ‌దిలీ… తాత్కాలిక అధ్య‌క్షురాలిగా క‌మ‌లా హారిస్‌…

అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  త‌న అధికార బాధ్య‌త‌ల‌ను ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్ కు బ‌ద‌లాయించారు.  ఈ నిర్ణ‌యం తాత్కాలిక‌మే.  అధ్య‌క్షుడు జో బైడెన్ కు ప్ర‌తిఏటా పెద్ద పేగుకు సంబంధించి కొల‌నోస్కోపి ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తారు.   ఈ స‌మ‌యంలో మ‌త్తు మందు ఇస్తారు.  ఆయ‌నకు ప‌రీక్ష‌లు పూర్త‌య్యి కోలుకునేంత వ‌ర‌కు క‌మ‌లా హారిస్ అధ్య‌క్షురాలిగా కొన‌సాగుతారు.

Read: అనంతపురంలో కూలిన 4అంతస్థుల భవనం..

క‌మ‌లా హారిస్‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు వైట్ హౌస్ అధికారికంగా ప్ర‌క‌టించింది.  దీంతో అమెరికా అధ్య‌క్ష ప‌దివిని చేప‌ట్టిన తొలి మ‌హిళ‌గా క‌మ‌లా హారిస్ రికార్డ్ సాధించారు.  అమెరికా రాజ్యాంగం ప్ర‌కారం  అధ్య‌క్షుడికి మ‌త్తు మందుతో ప‌రీక్ష‌లు చేసిన స‌మ‌యంలో బాధ్య‌త‌ల‌ను తాత్కాలికంగా ఉపాధ్య‌క్షుల‌కు బ‌దిలీ చేస్తారు.  గ‌తంలో బుష్‌కు కొల‌నోస్కోపి ప‌రీక్ష‌లు చేసిన స‌మ‌యంలో 2002, 2007లో బాధ్య‌త‌ల‌ను ఉపాధ్య‌క్షుడికి బ‌దిలీ చేసిన సంగ‌తి తెలిసిందే. 

Related Articles

Latest Articles