‘ఇండియన్ ఐడల్’ : 12వ సీజన్ కి 12 గంటల పాటూ ఘనమైన ముగింపు!

ప్రస్తుతం బుల్లితెరపై నడుస్తోన్న రియాల్టీ షోస్ లో ‘ఇండియన్ ఐడల్ 12’దే అగ్రస్థానం! వివాదాలు ఎన్ని రాజుకుంటున్నాయో అంతగా టీఆర్పీలు కూడా పోగవుతున్నాయి. ఎన్నో వారాలుగా కొనసాగుతోన్న మ్యూజిక్ కాంపిటీషన్ అంతకంతకూ ఆసక్తి పెంచుతోంది తప్ప తగ్గటం లేదు. అయితే, ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. ఆగస్ట్ 15వ తేదీన గ్రాండ్ ఫినాలే అంటున్నారు. అయితే, ఎప్పటిలా కాకుండా ఈసారి రికార్డు సృష్టించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట!

‘ఇండియన్ ఐడల్ 12’ పన్నెండు గంటల పాటూ కొనసాగుతుంది! ఇప్పుడు సొషల్ మీడియాలో వినిపిస్తోన్న టాక్ ఇది. అంతసేపు ఒక కార్యక్రమం నడపటం నిజంగా సాహసమనే చెప్పాలి. కానీ, జనం చూస్తారనే నమ్మకం మ్యూజిక్ రియాల్టీ షో ఆర్గనైజర్స్ కి ఉందట. అంతే కాదు, గంటల తరబడి సాగే ఫైనల్ పోటీకి స్పెషల్ అట్రాక్షన్ గా అనేక మంది సెలబ్రిలు హాజరవుతారని సమాచారం. మరో వైపు, ఇంతకు ముందటి ‘ఇండియన్ ఐడల్’ టైటిల్ విజేతలు కూడా షో జరుగుతుండగా మధ్యమధ్యలో వచ్చి వెళతారని చెబుతున్నారు!

పవన్ దీప్ రజన్, అరుణితా కంజిలాల్ లాంటి భారీ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ తో పాటూ తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ కూడా రేసులో దూసుకుపోతోంది. చూడాలి మరి, 12 గంటల మ్యూజికల్ మారథాన్ లో ఎవరు టైటిల్ కైవసం చేసుకుంటారో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-