వాట్స‌ప్‌కు పోటీగా భార‌త ప్ర‌భుత్వం స‌రికొత్త యాప్‌… ఆదిరిపోయే ఫీచ‌ర్ల‌తో…

మ‌న‌ద‌గ్గ‌ర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… అందులో త‌ప్ప‌ని సరిగా వాట్స‌ప్ ఉండి తీరుతుంది.  వాట్స‌ప్‌కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు.  అయితే, ఈ వాట్స‌ప్ ఎంత వ‌ర‌కు సుర‌క్షితం.  యూజ‌ర్ల  డేటాకు ఎంత వ‌ర‌కు భ‌రోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్న‌ప్ప‌టికీ సుర‌క్షితం కాద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  పైగా ఈ వాట్స‌ప్ విదేశీసంస్థ‌కు చెందిన‌ది కావ‌డంతో ఆందోళ‌న మ‌రింత ఎక్కువైంది.  వాట్స‌ప్‌కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్‌లు వ‌చ్చినా ఆక‌ట్టుకోలేక‌పోయాయి.  తాజాగా భార‌త ప్ర‌భుత్వం సందేశ్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  

Read: సీనియర్ నటుడి కాలు ఫ్యాక్చర్… హాస్పిటల్ లో చికిత్స

ఈ యాప్ వివ‌రాల‌ను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ లోక్‌స‌భ‌లో వివ‌రించారు.  సందేశ్ యాప్ సుర‌క్షిత‌మైంద‌ని, వ‌న్ టు వ‌న్ మెసేజ్‌, గ్రూప్ మెసేజ్‌, ఫైల్‌, మీడియా షేరింగ్‌, ఆడియో, వీడియో కాల్స్, ఈ గ‌వ‌ర్న‌మెంట్ అప్లికేష‌న్స్ అన్నింటిని ఈ యాప్ ద్వారా పొంద‌వ‌చ్చని మంత్రి లోక్ స‌భ‌లో పేర్కొన్నారు.  ఈ యాప్ ప్లేస్టోర్ ద్వారా అందుబాటులో ఉంద‌ని అన్నారు.  ఈ యాప్‌ను నేష‌న‌ల్ ఇన్నోవేష‌న్ సెంట‌ర్ డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఏజెన్సీలు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు యాక్సెస్ ఉండేది. అయితే, ఇప్పుడు అంద‌రికి అందుబాటులోకి వ‌చ్చిన‌ట్టు మంత్రి తెలిపారు.  మొబైల్ నెంబ‌ర్ ను న‌మోదు చేయ‌డం ద్వారా వ‌చ్చిన ఓటీపీ వెరిఫికేష‌న్‌తో ఈ యాప్‌ను వినియోగించుకోవ‌చ్చ‌ని కేంద్రం తెలియ‌జేసింది.  భార‌త ప్ర‌భుత్వం డెవ‌ల‌ప్ చేసిన యాప్ కావ‌డంతో దీనిపై అందిరి దృష్టి పడింది.  

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-