మొద‌లైన తాలిబ‌న్ల అరాచ‌కం: కాబూల్‌లో భారత వ్యాపారి కిడ్నాప్‌…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఏర్పాటైంది.  తాలిబ‌న్ల ప్ర‌భుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచ‌కాలు మొద‌ల‌య్యాయి.  న‌డిరోడ్డుపైనే బెదిరించి కిడ్నాపులు చేయ‌డం మొద‌లుపెట్టారు.  రాజ‌ధాని కాబూల్‌లో భార‌త వ్యాపారి బ‌న్స‌రీలాల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు.  50ఏళ్ల బ‌న్స‌రీలాల్ కాబూల్‌లో ఫార్మా వ్యాపారం చేస్తున్నారు.  ఉద‌యం కారులో ఇంటి నుంచి బ‌య‌లుదేర‌గా మార్గ‌మ‌ధ్యంలో ఓ కారులో వ‌చ్చిన దుండ‌గులు బ‌న్స‌రీలాల్ కారును ఢీకొట్టారు.  అనంత‌రం వ్యాపారిని, ఆయ‌న సిబ్బందిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు.  అయితే, సిబ్బంది త‌ప్పించుకొని బ‌య‌ట‌ప‌డ‌గా, భార‌త వ్యాపారి మాత్రం కిడ్నాప‌ర్ల చెర‌లోనే ఉన్నారు.  ఈ కిడ్నాప్ వ్యావ‌హారంపై భార‌త విదేశాంగ శాఖ‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు ఇండియ‌న్ వ‌ర‌ల్డ్ ఫోర‌మ్ అధ్య‌క్షుడు పునీత్ చందోక్ పేర్కొన్నారు.  ఈ కిడ్నాప్ వెనుక తాలిబ‌న్లు ఉన్నారా తేదంటే ఎంకెవ‌రైనా ఉన్నారా అనే విష‌యం తెలియాల్సి ఉన్న‌ది.  

Read: వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో రికార్డ్‌… ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-