పారాలింపిక్స్‌ లో భారత్ జోరు..ఖాతాలో మరో రెండు పతకాలు

పారాలింపిక్స్‌ లో భారత్‌ కు తాజాగా మరో రెండు పతకాలు వచ్చాయి. హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు రజత పతకం సాధించగా.. ఇదే హై జంప్‌ లోనే శరద్‌ కుమార్‌ కాంస్య పతకం సాధించారు. హై జంప్‌ లో మరియప్పన్‌ తంగవేలు మరియు శరద్ కుమార్‌ ఇద్దరు పతకాలు సాధించటం గమనార్హం. దీంతో ఇవాళ భారత్‌ కు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు వచ్చినట్లైంది. ఇక ఇవాళ వచ్చిన పతకాలతో ఇండియా కు వచ్చిన పతకాల సంఖ్య పదికి చేరింది. ఈ పతకాల్లో రెండు గోల్డ్‌ మెడల్ ఉండగా… 5 రజతాలు మరియు 3 కాంస్య పతకాలు ఉన్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-