ప్రతీకారం తీర్చుకున్న భారత్.. కివీస్‌పై టీ20 సిరీస్ కైవసం

టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరకుండా తమను అడ్డుకున్న న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా మరో టీ20 మిగిలి ఉండగానే 2-0 తేడాతో భారత్ టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. రెండో టీ20లో 154 పరుగుల విజయలక్ష్యంతో దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ (55. ఒక ఫోర్, 5 సిక్సులు), కేఎల్ రాహుల్ (65, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి విజయాన్ని సులువు చేశారు. అనంతరం సూర్యకుమార్ (1) అవుట్ అయినా వెంకటేష్ అయ్యర్ (12 నాటౌట్). పంత్ (12 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు సౌథీకే పడ్డాయి.

Read Also: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గప్తిల్

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు గప్తిల్ (31), మిచెల్ (31) వేగంగా ఆడారు. ఆ తర్వాత వచ్చిన చాప్ మన్ (21), ఫిలిప్స్ (34) పర్వాలేదనిపించారు. వారిద్దరూ ఔటయ్యాక భారత్ పుంజుకుంది. స్కోర్ వేగం పెరగకుండా బౌలర్లు కట్టడి చేశారు. చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ వెళ్లలేదు. హర్షల్ పటేల్ 2 వికెట్లు, భువనేశ్వర్, అశ్విన్, అక్షర్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.

Related Articles

Latest Articles