టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా క్వీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20ని కూడా మనోళ్లు వదిలిపెట్టలేదు. దీంతో కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను రోహిత్ శర్మ ప్రత్యేకంగా మలుచుకున్నాడు. కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టీ20లో 74 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 185 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను 111 పరుగులకే భారత్ ఆలౌట్ చేసింది. ఓపెనర్ గప్తిల్ (52) మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు, హర్షల్ పటేల్ 2 వికెట్లు సాధించారు. దీపక్ చాహర్, చాహల్, వెంకటేష్ అయ్యర్ తలో వికెట్ పడగొట్టారు. రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇదే తొలి సిరీస్ విజయం.

Read Also: రోహిత్ పేరిట మరో రికార్డు

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ (56) అర్థసెంచరీతో రాణించాడు. ఇషాన్ కిషన్ 29, శ్రేయాస్ అయ్యర్ 25, వెంకటేష్ అయ్యర్ 20 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, మిల్నే, ఫెర్గూసన్, సోధీ ఒక్కో వికెట్ తీశారు. కాగా ఈనెల 25 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.

Related Articles

Latest Articles