రెండో ఇన్నింగ్స్ లో భారత్ 466 పరుగులకు అలౌట్

ఇంగ్లాండ్‌ తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ లో టీమిండియా దుమ్ము లేపింది. నాలుగో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌ లో టీం ఇండియా ఏకంగా 466 పరుగులకు అలౌటైంది. రెండో సెషన్‌ లో పంత్‌ 50 పరుగులు మరియు శార్దూల్‌ ఠాకూర్‌ 60 పరుగులు, చేసి జట్టును ఆదుకున్నారు. ఇక వీరిద్దరికి తోడు టెయిలెండర్లు ఉమేశ్‌ యాదవ్‌ 25 పరుగులు మరియు బుమ్ర4ఆ 24 పరుగులు చేసి.. రాణించారు. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ సాధించడమే కాకుండా ఇంగ్లండ్‌ ముందు 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక అంతకు ముందు టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ 44 పరుగులు మరియు జడేజా 17 పరుగులు చేసి… నాలుగో వికెట్‌ కు హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని జోడించారు. కాసేపటి క్రితమే ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

Related Articles

Latest Articles

-Advertisement-