ముగిసిన రెండో రోజు ఆట… భారీ ఆధిక్యంలో భారత్

ఇండియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. అయితే ఈరోజును 221/6 తో ప్రారంభించిన భారత జట్టు మయాంక్ అగర్వాల్(150) అక్షర్ పటేల్ (52) సహాయంతో 325 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు, వచ్చిన బ్యాటర్ ను వచ్చినట్లు కుదురుకోనివ్వకుండా వెన్నకి పంపించారు. దాంతో ఆ జట్టు 62 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక కివీస్ బ్యాటింగ్ లో కైల్ జామీసన్(17), టామ్ లాథమ్(10) ఇద్దరే రెండంకెల స్కోర్ ను టచ్ చేసారు. అయితే భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు తీయగా… సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ ఒక్క వికెట్ పడగొట్టారు.

ఇక అనంతరం 263 పరుగులు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఆట ముగిసే సమయం వరకు ఒక్క వికెట్ పడనివ్వలేదు . ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ తో కలిసి ఓపెనర్ గా వచ్చిన పుజారా కొంచెం దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. దాంతో టీం ఇండియా ప్రస్తుతం 332 పరుగుల ఆధిక్యంతో ఉంది. అయితే ఈరోజు ముగిసే సమయం వరకు క్రీజులో ఉన్న మయాంక్(38), పుజారా(29) రేపు బ్యాటింగ్ కొనసాగిస్తారు.

Related Articles

Latest Articles