భారత్-ఇంగ్లాండ్ : వాయిదా పడిన ఆఖరి టెస్ట్

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టులలో 2-1 టీం ఇండియా ఆధిక్యంలో ఉంది. ఇక ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభం కావాల్సి ఉండగా అది వాయిదా పడింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీం ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనతో పటు మరికొంత మంది సహాయక సిబ్బంది ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ కారణంగానే చివరి టెస్ట్ వాయిదా పడింది. అయితే ఈ మ్యాచ్ రేపు ప్రారంభిస్తారా… ఇంకా వాయిదా వేస్తారా.. లేదా మొత్తానికే రద్దు చేస్తారా అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ రేపు ప్రారంభం అయితే 15 న ముగుస్తుంది. కానీ 17 నుండి కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ ప్రారంభం అనునా విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించి… దాని ఫలితం కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది.

Related Articles

Latest Articles

-Advertisement-