చ‌మురు ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు కేంద్రం వ్యూహాత్మ‌క నిర్ణ‌యం..!!

దేశంలో చ‌ముదు ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి.  ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ప్ర‌జలు ఆందోళ‌న‌లు చేస్తున్నారు.  అటు ప్ర‌తిప‌క్షాలు సైతం కేంద్రాన్ని విమ‌ర్శిస్తున్నాయి.  కొన్ని రోజుల క్రితం కేంద్రం చ‌ముదు ధ‌ర‌ల‌పై వ్యాట్‌ను త‌గ్గించింది.  తాజాగా, కేంద్రం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకోబుతున్న‌ట్టు స‌మాచారం.  అత్య‌వ‌స‌ర నిల్వ‌ల నుంచి దాదాపు 50 ల‌క్ష‌ల బ్యారెళ్ల ముడి చ‌మురును బ‌య‌ట‌కు తీసే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు స‌మాచారం.  

Read: ఆ దేశంలో మ‌ళ్లీ విజృంభించిన క‌రోనా… ప‌దిరోజులు సంపూర్ణ లాక్‌డౌన్‌…

చ‌మురు ధ‌ర‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు అమెరికా, జ‌పాన్ స‌హా అనేక దేశాలు ఇలాంటి వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నాయి.  దీంతో ఇండియా కూడా ఇలాంటి వ్యూహాన్ని అమ‌లు చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.  భార‌త్‌కు నార్త్‌, ఈస్ట్ తీరాల్లో చ‌మురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి.  అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఇక్క‌డి నుంచి ముడి చ‌మురును బ‌య‌ట‌కు తీసి వినియోగిస్తుంటారు.  ఈ వ్యూహాత్మ‌క చ‌మురు నిల్వ కేంద్రాల్లో దాదాపు 3.8 కోట్ల బారెళ్ల ముడి చ‌మురును నిల్వ‌చేస్తారు.  వ‌చ్చే వారం ప‌ది రోజుల్లో ఈ చ‌మురు నిల్వ కేంద్రాల నుంచి మంగుళూరులోని ఎంఆర్‌పీఎల్‌, హెచ్‌పీసీఎల్‌కు త‌ర‌లించ‌నున్నార‌ని స‌మాచారం. 

Related Articles

Latest Articles