ఐపీఎల్ తర్వాత మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్లనున్న టీంఇండియా…?

కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో వాయిదా పడిన తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత రూట్ సేనతో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడాల్సి ఉండటంతో అక్కడే ఉండిపోయింది కోహ్లీ సేన. ఈ నెల 14 న ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ యూఏఈ లో జరగనుండటంతో అక్కడికి వెళ్తుంది. అనంతరం అక్కడే ఉండి టీ20 ప్రపంచ కప్ లో పాల్గొననుంది. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్-భారత్ మధ్య రసవత్తరంగా టెస్ట్ సిరీస్ జరుగుతుండటంతో.. మళ్ళీ ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడుతాయి అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే తాజాగా భారత్ మళ్ళీ ఎప్పుడు ఇంగ్లాండ్ వెళ్లనుంది అనే ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2022 పూర్తయిన తర్వాత కోహ్లీసేన ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల సిరీస్ లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. 2022 జులై 1, 3, 6న భారత్-ఇంగ్లాండ్ మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుండగా జులై 9, 12, 14న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది.

Related Articles

Latest Articles

-Advertisement-