ఐరాసలో భార‌త్‌కు స‌రికొత్త బాధ్య‌త‌: భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్ష స్థానంలో ఇండియా…

ఐక్య‌రాజ్య‌స‌మితిలో భార‌త్‌కు స‌రికొత్త బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  ప్ర‌స్తుతం ఇండియా భ‌ద్ర‌తా మండ‌లిలో తాత్కాలిక స‌భ్య‌దేశంగా కొన‌సాగుతోంది.  స‌భ్య‌దేశంగా కొన‌సాగుతున్న ఇండియాల‌కు ఇప్పుడు ఆ మండ‌లి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు.  ఈ ప‌ద‌విలో భార‌త్ నెల‌రోజుల‌పాటు కొన‌సాగుతుంది.  ఇంత‌కు ముందు ఫ్రాన్స్ ఆ హోదాలో కొన‌సాగింది. ఐరాస‌లో భార‌త శాశ్వ‌త ప్ర‌తినిది టిఎస్ తిరుమూర్తి బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  భార‌త్‌కు ఈ ప‌ద‌వి వ‌చ్చేందుకు ఫ్రాన్స్ స‌హ‌క‌రించింది.  ఈ ఆగ‌స్టు నెల‌లోనూ అదే విధంగా తాత్కాలిక స‌భ్య‌దేశంగా త‌ప్పుకునే చివ‌రి నెలైన 2022 డిసెంబ‌ర్‌లోనూ ఇండియాకు ఈ అవ‌కాశం ఉంటుంది.  అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టిన ఇండియా శాంతి స్థాప‌న‌, ఉగ్ర‌వాదంపై పోరు, స‌ముద్ర‌తీర భ‌ద్ర‌త త‌దిత‌ర అంశాల‌పై దృష్టిసారిస్తున్న‌ట్టు అధ్య‌క్షుడు టీఎస్ తిరుమూర్తి పేర్కొన్నారు.  ఉగ్ర‌వాదంపై పోరులో భార‌త్ ఎప్పుడూ ముందు వ‌ర‌స‌లో ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  

Read: మ‌ళ్లీ పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు…గృహ వినియోగదారులకు ఊర‌ట‌…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-