భారత్-శ్రీలంక వన్డే సిరీస్ ఆలస్యం…

శిఖర్‌ధావన్‌ కెప్టెన్సీలో భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడటానికి శ్రీలంక వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడికి వెళ్లి తమ క్వారంటైన్ కూడా పూర్తి చేసిన త్రి=ఎం ఇండియా ప్రస్తుతం ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతుంది. అయితే ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారం భారత్-శ్రీలంక మధ్య మొదటి వన్డే మ్యాచ్ ఈ నెల 13 ప్రారంభం కావాలి. కానీ శ్రీనిక జట్టు సహాయక సిబ్బందిలో కొందరు కరోనా బారిన పడటంతో ఈ సిరీస్ లను రీ షెడ్యూల్ చేసారు. ఈ రెండు జట్ల మధ్య మొదటి వన్డే 5 రోజులు ఆలస్యంగా అంటే జులై 18న ప్రారంభం కానుంది. ఆ తర్వాత 20, 23 వరుసగా రెండు, మూడు వన్డే మ్యాచ్ లు జరగ్గా 25, 27, 29 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-