టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ కు జట్టు ప్రకటించిన బీసీసీఐ…

జూన్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు భారత జట్టు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్ తో ఆడనున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు 20 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ (C) అజింక్య రహానె (VC), రోహిత్ శర్మ, గిల్, మయాంక్, చేతేశ్వర్ పుజారా, హనుమ విహారీ, రిషబ్ (WK), ఆర్. అశ్విన్, ఇషాంత్, షమీ, సిరాజ్, షార్దుల్, ఉమేష్ లను తీసుకుంది. అలాగే సాహా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ పైన క్లారిటీ రావాల్సి ఉంది అని బీసీసీఐ తెలిపింది. ఎందుకంటే ఐపీఎల్ సమయంలో రాహుల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరగా సాహాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ సిరీస్ కు స్టాండ్ బై ఆటగాళ్లగా అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్ కృష్ణ, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వల్లాను ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.

Related Articles

Latest Articles