కేప్‌టౌన్ టెస్ట్… 33 పరుగులకే ఓపెనర్లు ఔట్

కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై సఫారీ బౌలర్లు విజృంభించారు. దీంతో 33 పరుగులకే భారత్ ఓపెనర్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 12 పరుగులు చేసి 31 పరుగుల వద్ద ఓలీవర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. మరో రెండు పరుగులకే భారత్ రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 15 పరుగులు చేసి రబాడ బౌలింగ్‌లో మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.

Read Also: మయాంక్‌కు నిరాశ.. ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అతడే…!!

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి రావడంతో హనుమా విహారిని తప్పించారు. అటు గాయం కారణంగా మహ్మద్ సిరాజ్ దూరం కాగా అతడి స్థానంలో ఉమేష్ యాదవ్‌కు జట్టులో స్థానం కల్పించారు. మూడు టెస్టుల సిరీస్‌లో తొలి టెస్టును టీమిండియా గెలుచుకోగా.. రెండో టెస్టును దక్షిణాఫ్రికా జట్టు సొంతం చేసుకుంది. దీంతో మూడో టెస్టులో ఏ జట్టు గెలిస్తే… ఆ జట్టుకే సిరీస్ సొంతం అవుతుంది.

Related Articles

Latest Articles