మళ్లీ పెరుగుతున్న కేసులు… భారత్‌లో కొత్తగా 37వేల మందికి పైగా కరోనా పాజిటివ్

కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Read Also: సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ అలా.. టీఎస్ఆర్టీసీ ఇలా…

కాగా భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,49,60,261కి చేరింది. ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,82,017కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి 3,43,06,414 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,71,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు దేశంలో 1,46,70,18, 464 కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Related Articles

Latest Articles