తగ్గేదే లే… ఒక్కరోజులో 1.41 లక్షల కరోనా కేసులు, 285 మరణాలు

దేశంలో కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. వారం కిందటి వరకు ప్రతిరోజూ వేలల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312కి చేరింది. నిన్న 285 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,178కి చేరింది.

ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169గా నమోదైంది. కొత్తగా 40,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,44,12,740కి చేరింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.36 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 90,59,360 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశామని… ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150.06 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 513, కర్ణాటకలో 333, రాజస్థాన్‌లో 291, కేరళలో 284, గుజరాత్‌లో 204, తెలంగాణలో 123, తమిళనాడులో 121, హర్యానాలో 114, ఒడిశాలో 60, ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,203 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.

తగ్గేదే లే...  ఒక్కరోజులో 1.41 లక్షల కరోనా కేసులు, 285 మరణాలు

Related Articles

Latest Articles