ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న భారత హాకీ జట్టు..

ఒలింపిక్స్‌ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతోంది. పూల్‌ -ఏ మూడో మ్యాచ్‌ లో 3-0 తేడాతో స్పెయిన్‌ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్‌ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్‌ చేసి.. మ్యాచ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది ఇండియా. నాలుగో క్వార్టర్‌ లో మూడో గోల్‌ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రూపిందర్‌ పాల్‌ రెండు గోల్స్‌ తో సత్తా చాటగా… 14 వ నిమిషం సిమ్రన్‌ జిత్‌ సింగ్‌ మరో గోల్‌ చేశాడు. దీంతో భారత్ విజయం సులభం అయింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-