డ్రాగ‌న్‌కు ధీటుగా… మారిష‌స్‌లో లో ఇండియా స్థావ‌రాలు…

ద‌క్షిణ చైనా స‌ముద్రంతో పాటుగా, డ్రాగ‌న్ దేశం హిందు మ‌హాస‌ముద్రంపై కూడా క‌న్నేసింది.  ఈ ప్రాంతంలోని జ‌లాల‌పై ఆదిప‌త్యం సాధించేందుకు అనేక ప్రాంతాల్లో పోర్టుల‌ను నిర్మిస్తోంది.  హిందూ మ‌హాస‌ముద్రం ప‌రిధిలోని చిన్న చిన్న దేశాల్లో పోర్టుల‌ను నిర్మిస్తూ ఆయా ప్రాంతాల‌పై ప‌ట్టు సాధిస్తోంది.  దీంతో అలర్టైన ఇండియా హిందు మ‌హాస‌ముద్రంపై నిఘాను పెంచేందుకు చ‌ర్య‌లు చెప‌ట్టింది.  మారిష‌స్‌లోని ఉత్త‌ర అగ‌లేగాలో 25 కోట్ల డాల‌ర్ల‌తో  పోర్టును నిర్మిస్తోంది.  ఇందులో 3000 మీట‌ర్ల పొడ‌వైన ర‌న్‌వే కీల‌క‌మైన‌ది.  పెద్ద విమానాలు సైతం దిగేందుకు వీలుగా ఇండియా ఈ పోర్టును నిర్మిస్తోంది.  విమానాల‌ను నిలిపి ఉంచేందుకు వీలుగా అఫ్రాన్ సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేసింది.  అదే విధంగా స‌ముద్రంలో షిప్పుల కోసం జ‌ట్టీల‌ను ఏర్పాటు చేసింది.  ఈ స్థార‌వం నుంచి పీ 8 విమానాలు ఆ ప్రాంతంలో నిరంత‌రం గ‌స్తీ కాస్తున్నాయి.  వ్యాపార వాణిన్య నౌక‌లు ప్ర‌యాణం చేసే కీల‌క మొజాంబిక్ ఛాన‌ల్‌లోని నౌక‌ల క‌ద‌లిక‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఈ వైమానిక స్థావ‌రం ద్వారా క‌నిపెట్డ‌వచ్చు.

Read: ఇండియా కరోనా అప్డేట్ : కొత్తగా 22,842 కేసులు

-Advertisement-డ్రాగ‌న్‌కు ధీటుగా... మారిష‌స్‌లో లో ఇండియా స్థావ‌రాలు...

Related Articles

Latest Articles