వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయిని దాటిన భారత్

భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ… వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని చేరింది. తొలి, రెండో డోసు కలిపి 150 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘కొత్త ఏడాదిలో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలు, కంపెనీలు, హెల్త్ కేర్ ఉద్యోగులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి కష్టంతో ఈ మైలురాయిని సాధించాం. సున్నా నుంచి ఈ స్థాయికి వచ్చాం. ఇది దేశం ఘనత. దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారు ఇప్పటికే 90 శాతానికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ అందుకున్నారు. తొలి ఐదురోజుల్లో 15-18 ఏళ్ల టీనేజర్లు కూడా 1.5 కోట్ల మందికి పైగా తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.

Read Also: తగ్గేదేలే అంటున్న ఒమిక్రాన్… దేశంలో 3వేలు దాటిన కేసులు

కాగా దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సిన్ పూర్తి చేశాయి. కొన్ని రాష్ట్రాలలో 80 శాతం రెండో డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయింది. తెలంగాణలో ఇప్పటివరకు 70 శాతానికి పైగా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సిన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటివరకు కోటిమందికిపైగా టీనేజర్లు తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Related Articles

Latest Articles