ఇండియాలో కొత్తగా 10,488 కరోనా కేసులు, 313 మరణాలు

ఇండియాలో క‌రోనా క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,488 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,45,10,413 కి చేరింది.

ఇందులో 3,39,22,037 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,22,714 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 313 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,65,662 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 12,329 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 1,16,50,55,210 మంది టీకాలు తీసుకున్నారు.

Related Articles

Latest Articles