భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు…

దేశంలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది.  రోజువారీ కేసులు ల‌క్ష దాటిపోతున్నాయి.  తాజాగా దేశంలో 1,68,063 కేసులు న‌మోద‌య్యాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 277 మంది మృతి చెందారు.  ప్ర‌స్తుతం దేశంలో 8,21,446 యాక్టీవ్ కేసులు ఉన్న‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ స్ప‌ష్టం చేసింది.  దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 152 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసిన‌ట్టు  గ‌ణాంకాలు చెబుతున్నాయి.  నిన్న‌టితో పోలిస్తే ఈరోజు 6.4 శాతం త‌క్కువ‌గా కేసులు న‌మోద‌య్యాయి.  అనేక రాష్ట్రాల్లో నైట్ క‌ర్ఫ్యూ తో పాటు నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేస్తుండ‌టంతో కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.  ఢిల్లీ, రాజ‌స్థాన్‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో వీకెండ్ క‌ర్ఫ్యూ కూడా అమ‌లు చేస్తున్నారు.  వారంలో ఒక‌టి రెండు రోజుల‌పాటు వీకెంట్ క‌ర్ఫ్యూలు విధించ‌డం వ‌ల‌న కేసులు కొంత మేర అదుపులోకి వ‌స్తున్నాయి.

Read: మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం… వ్య‌తిరేకిస్తున్న కాంగ్రెస్‌…

నైట్‌, వీకెండ్ క‌ర్ఫ్యూలు అమ‌లు చేస్తూనే వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లు చేయ‌డం కూడా ఇందుకు క‌లిసివ‌స్తోంది.  నిన్న‌టి నుంచి దేశంలో మూడో డోస్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  2.75 కోట్ల మంది 60 ఏళ్లు దాటిన వారికి, కోటి మంది హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు, రెండు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియ‌ర్ల‌కు ప్రికాష‌న‌రీ డోస్‌లు వేస్తున్నారు.  రెండో డోసు కింద ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో మూడో డోస్ కింద అ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది.  సెకండ్ డోస్ తీసుకున్న 9 నెల‌ల తరువాత మూడో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది.  అయితే, 18 ఏళ్లు దాటిన అంద‌రికి మూడో డోస్ ఇచ్చే విష‌యంపై ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.  

Related Articles

Latest Articles