ఇండియా కరోనా అప్డేట్ ..2219 మరణాలు

ఇండియాలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  గ‌తంలో నాలుగు లక్ష‌ల‌కు పైగా న‌మోద‌వ్వ‌గా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య ల‌క్ష‌కు త‌గ్గిపోయింది.  తాజాగా కేంద్రం క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది.  ఈ బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 92,596 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది.  ఇందులో 2,75,04,126 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి.  ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2219 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,53,528కి చేరింది.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 1,62,664 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-