భారత్‌ కరోనా అప్‌డేట్‌.. స్థిరంగా కేసులు

భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్‌తో పోలిస్తే.. తాజా బులెటిన్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 45,352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. కరోనా బారినపడి మరో 366 మంది ప్రాణాలు వదిలారు.. ఇదే సయయంలో 34,791 మంది కోవిడ్‌ బాధితులు కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 3,20,63,616కు పెరగగా.. ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,39,895కు చేరింది.. మరోవైపు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,99,778 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.. ఇక, ఇప్పటి వరకు 67,09,59,968 డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశామని ప్రకటించింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-