చిన్న పిల్ల‌ల వ్యాక్సిన్ కూడా వ‌చ్చేస్తోంది…!

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ క‌ల‌వ‌ర‌పెడుతోన్న స‌మ‌యంలోనే.. థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉంద‌నే హెచ్చ‌రిక‌లు గుబులు రేపుతున్నాయి… ఇక‌, థ‌ర్డ్ వేవ్‌లో చిన్నారుల‌పైనే ఎక్కువ ప్ర‌భావం చూపుతుంద‌న్న ముంద‌స్తు హెచ్చ‌రిక‌ల‌తో.. చిన్నారులు కోవిడ్ బారిన‌ప‌డితే.. ఎలా అనేదానిపై ఇప్ప‌టికే ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు దృష్టిసారించాయి.. మ‌రోవైపు.. కొన్ని రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ స‌మ‌యంలోనే పెద్ద ఎత్తున చిన్నారులు కూడా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. మ‌రోవైపు.. కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వాక్సినేష‌న్‌.. కానీ, భార‌త్ ఇప్ప‌టి వ‌ర‌కు 18 ఏళ్ల పైబ‌డిన‌వారికి మాత్ర‌మే వాక్సిన్‌కు అనుమ‌తి ఇచ్చింది ప్ర‌భుత్వం. అయితే, త్వ‌ర‌లోనే చిన్నారుల‌కు కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.. దీనిపై జైడస్‌ క్యాడిలా, భారత్‌ బయోటెక్‌.. ఇప్ప‌టికే ప‌ని మొద‌లుపెట్టాయి.. మ‌రో రెండు వారాల్లో జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగం కోసం అనుమ‌తించాలంటూ.. డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేయ‌డానికి సైతం సిద్ధం అవుతున్నాయి.. జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ను జైకోవ్‌-డీ (ZyCoV-D) పేరుతో తయారు చేస్తున్నారు.. దీనికి అనుమ‌తి వ‌స్తే.. చిన్న‌పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సిన్ మొద‌టలుపెట్ట‌నున్నారు.

ఇప్పుడు జైకోవ్‌-డీ వ్యాక్సిన్ ఒక్క‌టే కాదు.. మ‌రికొన్ని రోజుల్లో పిల్లలపై కొవాగ్జిన్‌ ట్రయల్స్ పూర్తికానున్నాయి.. భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకాను ప్రస్తుతం 2-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్ నిర్వ‌హిస్తుండ‌గా.. జైడస్ 12-18 ఏళ్ల పిల్లల‌పై ట్రయల్స్‌ నిర్వహిస్తోంది. ఇక‌, 5-12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలపై కూడా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు స‌న్న‌హాలు చేస్తోంది.. మ‌రోవైపు.. వ్యాక్సిన్‌ తొలి, రెండో దశ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు.. టీకాకు అనుమతులు వస్తే.. ఏడాదికి 240 మిలియన్ డోసుల‌ను తయారీ చేయాలని జైడస్ ప్లాన్‌గా ఉంది. మొత్తంగా థ‌ర్డ్ వేవ్ భ‌య‌లు వెంటాడుతోన్న త‌రుణంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా చిన్న‌పిల్ల‌ల వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వ‌స్తే.. కోవిడ్‌ను ఎదుర్కోవ‌డం క‌ష్ట‌మేం కాద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-