ఇండియా క‌రోనా అప్డేట్: స్వ‌ల్పంగా పెరిగిన కేసులు…

ఇండియాలో క్ర‌మంగా క‌రోనా కేసులు త‌గ్గుతున్నాయి.  వేగంగా టీకాలు వేస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం.  నిన్న‌టి రోజున క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి.  అయితే, ఈరోజు స్వ‌ల్పంగా కేసులు పెరిగిన‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  తాజా బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 38,792 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,09,46,974కి చేరింది.  ఇందులో 3,01,04,720 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,29,946 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  

Read: శ్రీవారి భ‌క్తుల‌కు షాక్‌: మ‌రో రెండు నెల‌లు ఆ మార్గం మూసివేత‌…

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 624 మంది మృతి చెందారు.  దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,11,408కి చేరింది.  ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో 41,000 మంది క‌రోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  దేశంలో 24 గంట‌ల్లో 37,14,441 మందికి టీకాలు వేసిన‌ట్టు ఆరోగ్య‌శాఖ తెలియ‌జేసింది.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 38,76,97,935 మంది ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ ను అందించారు.  

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-