ఇండియా క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతి కొన‌సాగుతోంది.  కేసులు 20 వేల‌కు పైగా న‌మోద‌వుతున్నాయి.  తాజాగా దేశంలో 25,404 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 3,32,89,579కి చేరింది.  ఇందులో 3,24,84,159 మంది కోలుకొని డిశ్చార్చ్ అయ్యారు.  3,62,207 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 37,127 మంది కోలుకున్న‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ క‌రోనా బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  24 గంట‌ల్లో క‌రోనాతో 339 మంది మృతి చెందారు.  దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 4,43,213 మంది క‌రోనాతో మృతి చెందారు.  ఇక ఇదిలా ఉంటే,  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 78,66,950 మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 75,22,38,324 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ పేర్కొన్న‌ది.  

Read: విప‌ణిలోకి స‌రికొత్త సైకిల్స్‌: ఒక‌సారి చార్జింగ్ చేస్తే….

Related Articles

Latest Articles

-Advertisement-