కరోనా థర్డ్ వేవ్.. ఇండియాలో ఒక్కరోజే 90,928 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు జెట్ స్పీడులో దూసుకెళ్తున్నాయి. బుధవారంతో పోలిస్తే దాదాపు కేసుల సంఖ్య రెట్టింపుగా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో నిన్న 325 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,82,876కి చేరింది.

అటు దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,43,41,009కి చేరింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,85,401గా ఉంది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.46 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 148.67 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 2,630 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా వాటిలో ఏపీలో 28, తెలంగాణలో 94 కేసులు ఉండటం గమనార్హం.

కరోనా థర్డ్ వేవ్.. ఇండియాలో ఒక్కరోజే 90,928 పాజిటివ్ కేసులు

Related Articles

Latest Articles