ఇండియా కరోనా అప్డేట్‌ : 24 గంటల్లో 42,640 కేసులు..

మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 42,640 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,99,77,861 కి చేరింది. ఇందులో 2,89,26,038 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 6,62,521 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

read also : వాహనదారులకు ఊరట !

ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 1167 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 3,89,302 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 81,839 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 28,87,66,201 మందికి వ్యాక్సిన్ అందించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-