‘ఇండిపెండేన్స్ డే’ మూవీకి 25 ఏళ్లు! లక్ష డాలర్లు విలువ చేసే టపాసులతో హాలీవుడ్ స్టార్ సంబరం!

‘ఇండిపెండెన్స్ డే’… ఈ మాట చెబితే… అమెరికన్స్ కి జూలై 4 స్ఫురణకు వస్తుంది. ఆ రోజున అగ్ర రాజ్యానికి బ్రిటన్ నుంచీ దేశం నుంచీ స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, అదే సమయంలో యూఎస్ మూవీ లవ్వర్స్ కి ‘ఇండిపెండెన్స్ డే’ పేరు చెబితే 1996 హాలీవుడ్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ ‘ఇండిపెండెన్స్ డే’ గుర్తుకు వస్తుంది! పాతికేళ్ల నాటి ఆ సినిమా విల్ స్మిత్ ని హాలీవుడ్ స్టార్ గా మార్చింది. అంతకు ముందు ఆయన టెలివిజన్ స్టార్ గా మాత్రమే ఫేమస్…

తనని టీవీ నుంచీ హాలీవుడ్ వెండితెరపైకి ఠీవీగా తీసుకొచ్చిన ‘ఇండిపెండెన్స్ డే’ మూవీని రీసెంట్ గా గ్రాండ్ వేలో సెలబ్రేట్ చేసుకున్నాడు విల్ స్మిత్. ఆ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సొషల్ మీడియాలో అనేక ఆసక్తికరమైన ఫోటోలు పోస్ట్ చేశాడు. వాటిల్లో రెండున్నర దశాబ్దాల నాటి యంగ్ విల్ స్మిత్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆయన లుక్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఫోటోలతో పాటూ ఒక వీడియో కూడా అప్ లోడ్ చేశాడు విల్. అందులో ‘ఇండిపెండెన్స్ డే’ మూవీలోని ‘వెల్కమ్ టూ ఎర్త్’ ఫుల్ సీక్వెన్స్ ఉండటం విశేషం. ఆ సన్నివేశాలే సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయంటారు! అవే విల్ స్మిత్ ని ఓవర్ నైట్ క్రేజీ స్టార్ గా మార్చేశాయి!

ప్రస్తుతం అమెరికాలోని న్యూ ఓర్లీన్స్ నగరంలో ఉంటున్నాడు విల్ స్మిత్. తన ‘ఇండిపెండెన్స్ డే’ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సొషల్ మీడియాలో ప్రత్యేకమైన పోస్ట్ పెట్టటమే కాకుండా మరో ఆశ్చర్యకరమైన పని చేశాడు! ఒక లక్ష డాలర్లు ఖర్చు చేసి న్యూ ఓర్లీన్స్ నగరం మొత్తం మిరిమిట్లు గొలిపేలా జూలై 4వ తేదీన ఫైర్ వర్క్స్ షో ఏర్పాటు చేయించాడు! ‘’ఎంత గొప్ప సినిమా అయితే మాత్రం టపాసులకి లక్ష డాలర్లా?’’ అంటారా! ఆయన తన ‘ఇండిపెండెన్స్ డే’ సినిమా కోసం ఫైర్ వర్క్స్ ఏర్పాటు చేయించలేదు! ప్రతీ ఏటా అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆకాశంలో భారీగా వెలుగులు విరజిమ్మిస్తుంటారు. కానీ, కరోనా కారణంగా పోయిన యేడు, ఈ సంవత్సరం కూడా చాలా చోట్ల టపాసుల సంబరం ఆగిపోయింది. విల్ స్మిత్ ప్రస్తుతం మకాం వేసిన న్యూ ఓర్లీన్స్ లోనూ అదే పరిస్థితి. కానీ, మన ‘ఇండిపెండెన్స్ డే’ స్టార్ అమెరికన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మొత్తం నగరానికి ఫైర్ వర్క్స్ సర్ ప్రైజ్ ఇచ్చాడు! లక్ష డాలర్ల స్వంత ఖర్చుతో ఆకాశాన్ని అద్భుతంగా రాజేశాడు…
1996 ‘ఇండిపెండెన్స్ డే’ మూవీతో మొదలైన విల్ స్మిత్ క్రేజ్… ఎన్ని అమెరికన్ ఇండిపెండెన్స్ డేలు వచ్చి, వెళుతోన్నా… పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు!

View this post on Instagram

A post shared by Will Smith (@willsmith)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-