భారత్ – కివీస్ : ముగిసిన నాలుగో రోజు ఆట…

భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. అయితే నిన్న ఆటను రెండో ఇన్నింగ్సులో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసి ముగించిన భారత జట్టుకు ఈరోజు కివీస్ బౌలర్లు షాక్ ఇచ్చారు. టాప్ ఆర్డర్ ను త్వరగా కూల్చేశారు. కానీ, ఆ తర్వాత శ్రేయర్ అయ్యర్(65) అర్ధశతకంతో రాణించగా.. అశ్విన్ (32) పరుగులతో ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. వీరివురు ఔట్ అయిన తర్వాత కీపర్ సాహా, స్పిన్నర్ అక్షర్ పటేల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. వీరిద్దరూ 8వ వికెట్ కు 67 పరుగులు జోడించాడు.

అయితే అప్పటికే భారత్ ఆధిక్యం 283 కు చేరుకోవడంతో కెప్టెన్ రహానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసాడు. దాంతో కివీస్ లక్ష్యం 284 గా నిర్ధేశించబడింది. ఇక ఈ రోజు ఆట ముగియడానికి 4 ఓవర్ల ముందు బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు అశ్విన్ షాక్ ఇచ్చాడు. అశ్విన్ వేసిన మూడో ఓవర్ లో విల్ యంగ్ (2) వికెట్ ను న్యూజిలాండ్ జట్టు కోల్పోయింది. దాంతో ఈ నాలుగో రోజును కివీస్ 4/1 తో ముగించింది. ప్రస్తుతం టామ్ లాథమ్ (2), విలియం సోమర్విల్లే(0) క్రీజులో ఉన్నారు.

Related Articles

Latest Articles