తెలంగాణ స్కూళ్లలో పెరిగిన విద్యార్థుల హాజరు

పద్దెనిమిది నెలల తరువాత తెలంగాణాలో మళ్ళీ ఈ నెల 1వ తారీఖు నుంచి స్కూల్స్ తెరుచుకున్నాయి. అయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో విద్యార్థులు స్కూల్స్ కి ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5,526 ప్రైవేటు.. 2,249 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరిలో తొలి రోజు చాలాచోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగానే కనిపించింది. సుమారు 21.77 శాతం మంది విద్యార్థులు మొదటి రోజు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 35 శాతానికి చేరుకుంది.

తల్లిదండ్రులు.. విద్యార్థులను భయం లేకుండా స్కూళ్లకు పంపిస్తున్నారని చెబుతున్నారు టీచర్లు. స్కూల్ మొత్తాన్ని రోజు సానిటైజ్ చేస్తున్నామని, స్కూల్‌లోనే వారికి మాస్క్ కూడా ఇచ్చి వాటిని పెట్టుకునేల ఏర్పాట్లు చేశామని అంటున్నారు. బైట్ : ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. చాలా రోజుల తరువాత స్కూల్స్ కి వెళ్లడంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల కంటే ఆఫ్లైన్ క్లాసులు బాగున్నాయంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పాఠశాలలు కరోనా నిబంధనలు పాటిస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తొలి రోజు వచ్చిన విద్యార్థుల హాజరు శాతానికి నేటికీ చాలా తేడా ఉంది. త్వరలోనే మళ్ళీ అన్ని స్కూల్స్ విద్యార్థులతో నిండిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-